janaprabha

janam kosam manam

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పని సరి…

1 min read

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పని సరి…

కుత్బుల్లాపూర్ జనవరి 30, (జనప్రభ):

 కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత జి.సురేఖ ప్రధానోపాధ్యాయురాలు, ప్రాథమిక పాఠశాల ప్రగతి నగర్ ఉద్యోగ విరమణ అభినందన సభకు శనివారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్, మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జి.సురేఖ ని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ వృత్తి నిబద్ధతకు మారుపేరు సురేఖ అని, ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పని సరని అన్నారు. విద్యాపరంగా ప్రగతి నగర్ లో సురేఖ ఎన్నో సేవలు అందించారని, ఎంతో మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన ఘనత వారికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ గోపి ఐఎఎస్, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ మరియు కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *