janaprabha

janam kosam manam

పల్లె ప్రకృతి వనానికి, స్కూల్ ప్రహరీగోడకు శంకుస్థాపన

పల్లె ప్రకృతి వనానికి, స్కూల్ ప్రహరీగోడకు శంకుస్థాపన
మోత్కూరు జనవరి 28,(జనప్రభ):
మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో హైస్కూల్ ప్రహరీ గోడకు శుక్రవారం ఎంపీపీ సంధ్యారాణీ, సర్పంచ్ పేలపూడి మధు శంకుస్థాపన చేశారు.తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సహకారంతో డిఎంఎఫ్ నిధుల నుండి సుమారు మూడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు.అనంతరం గ్రామంలోని పల్లె ప్రకృతి వనానికి సర్పంచ్ పేలపూడి మధు శంకుస్థాపన చేసి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమలలో సింగిల్విండో వైస్ చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు,ఉప సర్పంచ్ కప్పే వెంకటేశం,సోలిపురం కృష్ణా రెడ్డి,సింగిల్ విండో డైరెక్టర్ జిట్ట లక్ష్మయ్య,ఎంఎన్ సి చైర్మన్ జిట్ట సాలయ్య,వార్డు మెంబర్లు జిట్ట విరమ్మ,తొంట సుగుణమ్మ,బంగ పరమేష్,నాయకులు బండ లింగయ్య,రాంనర్సయ్య,మల్లం సైదులు,విరస్వామి,హెచ్.ఎం.వీరారెడ్డి,పంచాయతీ కార్యదర్శి కిరణ్,గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *