ఇల్లు దగ్ధమైన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన నాయకులు

ఇల్లు దగ్ధమైన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన నాయకులు
మోత్కూరు జనవరి 27, మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రం అన్నెపువాడలో శనివారం కరెంట్ షాక్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం కాగా యాట విరేశం ఉమా దినసరి కూలీ పని చేసుకునే వారు ఇల్లు దగ్ధం కావడంతో నిరాశ్రయులయ్యారు.బుధవారం టిఆర్ఎస్,కాంగ్రెస్ నాయకులు వేర్వేరుగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.మోత్కూరు మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి మెగారెడ్డి రూ. 5000,పదవ వార్డు కౌన్సిలర్ బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి రూ.5000 ఆర్థిక సహాయం అందించారు.రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ కాంగ్రెస్ నాయకులు గుర్రం లక్ష్మీ నర్సింహ రెడ్డి,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగొని రామచంద్రు గౌడ్ బియ్యం,వంట సరుకులు,వంట సమన్లు,దుప్పట్లు అందించారు.ఎన్ఆర్ఐ పోచము మధు భానుప్రియ రూ.3000 రెడ్ క్రాస్ యువజన విభాగం నుండి బీసు మత్సగిరి రూ.1000 ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమాలలో టిఆర్ఎస్ నాయకులు పాషా,ఎస్ ఎం సి చైర్మన్ దండ్ల కళ్యాణ్,కనుకురాజు,ప్రవీణ్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మందుల సురేష్,పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీను,పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అన్నెపు నర్సింహ,పన్నాల శ్రీనివాస్ రెడ్డి,అన్నెపు పద్మ నర్సింహ,వంగాల రాములు,బందెల రవి,అన్నెపు సతీష్,తదితరులు పాల్గొన్నారు.