పదవి విరమణ చేసిన ఆర్మీ జవాన్ ను ఘనంగా సన్మానించిన చిలుకానగర్ మిత్ర మండలి ప్రతినిధులు

పదవి విరమణ చేసిన ఆర్మీ జవాన్ ను ఘనంగా సన్మానించిన చిలుకానగర్ మిత్ర మండలి ప్రతినిధులు
మేడిపల్లి ఫిబ్రవరి 3,(జనప్రభ):ఉప్పల్ చిలుకానగర్ ప్రాంతానికి చెందిన రాచెర్ల ప్రేమ్ కుమార్ ఇండియన్ ఆర్మీలో వివిధ హోదాలో పదిహేడు సంవత్సరాలు దేశ రక్షణ విభాగంలో సేవలు అందించి సోమవారం పదవి విరమణ చేసిన సందర్భంగా దళిత రత్న యువజన సంఘం ప్రతినిధులు అతన్ని పూలమాలలు వేసి శాలువతో ఘనంగా సన్మానం చేసి అతని సేవలు మరియు ధైర్య సాహసాలు కొనియాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం కోసం ఎన్నో సేవలు చేసి పదవీ విరమణ పొందిన ఆర్మీ జవాను సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు వడ్డెపల్లి వెంకటేష్, నీరుడు అంజన్ కుమార్, మేకల జీవన్ కుమార్, నీలం గణేష్, రామన్కోల్ ప్రేమ్, అనిల్, పృథ్విరాజ్, డానియల్, తదితరులు పాల్గొన్నారు.