గురుకుల బాలికల ఫైన్ ఆర్ట్స్ పాఠశాలను సందర్శించిన మంత్రులు

గురుకుల బాలికల ఫైన్ ఆర్ట్స్ పాఠశాలను సందర్శించిన మంత్రులు
మేడిపల్లి ఫిబ్రవరి 2,(జనప్రభ):పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గురుకుల బాలికల ఫైన్ ఆర్ట్స్ పాఠశాలను మంగళవారం నాడు స్త్రీ శ్రీ సు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి కార్మిక,ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సందర్శించడం జరిగింది.అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న వసతులను,భోజన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.వివిధ కళల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల ప్రతిభను తిలకించడం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ సమాజంలో వెనుకబాటుతనం పోవాలంటే విద్య ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి కెసిఆర్ గుర్తించి గిరిజన బిడ్డలకు అనేక గురుకుల పాఠశాలలు ప్రారంభించి అవకాశం కల్పించారని అన్నారు.కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకుల పాఠశాలలో ఉత్తమ విద్యా బోధనతో పాటు నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుందని అన్నారు.అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో గురుకుల పాఠశాలలను,జూనియర్, డిగ్రీ కళాశాలను చాలా వరకు పెంచడం జరిగిందని అన్నారు..ఈ కార్యక్రమంలో మేయర్ జక్క వెంకటరెడ్డి,డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్,కార్పొరేటర్లు కౌడే పోచయ్య,సుభాష్ నాయక్,అమర్ సింగ్,మద్ది యుగంధర్ రెడ్డి,పాఠశాల సిబ్బంది,అధికారులు,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.