janaprabha

janam kosam manam

చల్లా ధర్మారెడ్డి ని వెంటనే బర్తరఫ్ చేయాలి

చల్లా ధర్మారెడ్డి ని వెంటనే బర్తరఫ్ చేయాలి

మేడిపల్లి ఫిబ్రవరి 2,(జనప్రభ)

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అప హేళన చేస్తూ ఎస్సీ ఎస్టీ బిసి ఉద్యోగులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను నిరసనగా మంగళవారం నాడు అంబేద్కర్ ఆశయ సాధన సంఘం, తెలంగాణ బహుజన ఉపాధ్యాయ సంగం సంయుక్త ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.అనంతరం చల్ల ధర్మారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య, తెలంగాణ బహుజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇటికాల రవీందర్ మాట్లాడుతూ చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఎస్సీ,ఎస్టీ,బిసి ఉద్యోగుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని కాబట్టి గవర్నర్ వెంటనే జోక్యం చేసుకొని ఆయనను వెంటనే ఎమ్మెల్యే పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఆయనపై ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.అదేవిధంగా రిజర్వేషన్ల జోలికి ఎవరైనా వస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ ఓట్ల తో గెలిచిన చల్లా ధర్మారెడ్డి నైతికత ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురుకుల పేరెంట్స్ కమిటీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గుండ్ల కుమారస్వామి, భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు లక్ష్మీ నరసింహ,మైసిగళ్ళ కుమార్, సగ్గు నరసింహ, శ్రీ రాముల రమేష్, కామ గళ్ళ బాబు, శ్రీకాంత్,
చంటి శివ ఈతకోట గోపాలకృష్ణ, రాయగిరి బాబు, రాజేష్ మహేష్ బొల్లం శశి, గడ్డం మధు, బన్నీ భీమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *