janaprabha

janam kosam manam

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేడిపల్లి తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా…

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేడిపల్లి తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా…

మేడిపల్లి జనవరి 30,
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ‘బండి సంజయ్, ఆదేశాల మేరకు పిర్జాధిగూడ, బొడుప్పల్ జంట కార్పొరేషన్ల అధ్యక్షులు ‘నమిలికొండ అనిల్ రెడ్డి, ‘గొనె శ్రీనివాస్, ఆధ్వర్యంలో మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు 45 శాతం ఫిట్మెంట్తో కూడిన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని అలాగే తెరాస ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతి ఇవ్వడంలో ప్రభుత్వ విఫలం అయినందుకు నిరసన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ లో కేవలం కేసీఆర్ కుటుంబం ఒకటే బంగారు కుటుంబం అయింది అని ఉద్యోగుల సమస్యల్ని గాలికి వదిలేశారు అని వ్యాఖ్యానించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ‘కూరపటి విజయ్, జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు ‘బండారు పవన్ రెడ్డి, మహిళ మోర్చా అధ్యక్షురాలు ‘విజయలక్ష్మి, బొడుప్పల్ కార్పొరేటర్ ‘కిరణ్ కుమార్ రెడ్డి, ‘శ్రీ సుధ, ‘కరుణాకర్ రెడ్డి, ‘రాజశేఖర్ రెడ్డి, ‘గీతారం, ‘మేక రామ్ రెడ్డి, ‘మహేష్, ‘హరీష్, ‘సంధ్య రెడ్డి, ‘లక్మయ్యా, ‘వాసుదేవ్ రెడ్డి, చిత్తరంజన్ రెడ్డి, ‘గిరి, ‘భిక్షపతి, ‘వెంకటేష్, ‘నవీన్, ‘ఏనుగు శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *