janaprabha

janam kosam manam

స్మశాన వాటిక ను కూడా వదలని కబ్జా రాయుళ్లు…

స్మశాన వాటిక ను కూడా వదలని కబ్జా రాయుళ్లు…

అంతా నా ఇష్టం అంటున్న ఓ కోఆప్షన్ మెంబర్…

 

అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ఆయన కే దాసోహం…

మేడిపల్లి జనవరి 29,(జనప్రభ):మేడిపల్లి మండలం
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడవ డివిజన్ లో క్రిస్టియన్, ముస్లిం ల స్మశాన వాటిక కోసమని అప్పట్లో 3 ఎకరాల భూమిని కేటయించారు అప్పటి గ్రామ పెద్దలు. ఈ స్మశాన వాటిక పక్కనే ఒక బడా నాయకుడు వెంచర్ మొదలుపెట్టాడు. హ బడా నాయకుని కన్ను స్మశాన వాటిక 3 ఎకరాల భూమి పై పడింది. ఎలాగూ మైనార్టీల స్మశాన వాటిక కు ఏ పేపర్లు, పత్రాలు లేవని తెలుసుకొని కొంచెం కొంచెం కబ్జా చేయడం మొదలుపెట్టాడు. కబ్జా మొదలు అవగానే అధికారులు అంతా అయనకే దాసోహం అయ్యారు. అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా ఆయనకే వత్తాసు పలుకుతున్నారని మా పేద ప్రజలను అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు అక్కడి మైనార్టీ ప్రజలు. బొందల గడ్డను సైతం వదలని అక్రమార్కులు మా కార్పొరేషన్ లో ఉండడం మా దురదృష్టం అంటున్నారు అక్కడ ఉన్న మైనార్టీ ప్రజలు. అధికారులు కూడా ఎవరికి వారు ఎంతెంత తీసుకున్నారో కానీ వాళ్ళు కూడా ఆ కబ్జా రాయుల్లకే వత్తాసు పలుకుతున్నారని, అసలు వారిని అధికారులు అనాల…? లేక ఆ బడా నాయకుని కి తోత్తులు అనాలా అని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా మా భూమి మాకు ఇవ్వాలని కబ్జా చేస్తున్న ఆ బడా నాయకునికి (ఓ కో ఆప్షన్ మెంబెర్) మా ఆవేదన వ్యక్తం చేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *