janaprabha

janam kosam manam

కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దందాను అరికట్టాలి

కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దందాను అరికట్టాలి:ఎ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు యన్ ఎ స్టాలిన్

కార్పొరేట్ విద్యాసంస్థల కబంధ హస్తలల్లో విద్యాశాఖ

మేడిపల్లి జనవరి 29,(జనప్రభ):

కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్లైన్ విద్యాబోధన పేరుతో ట్యూషన్ ఫీజులు పూర్తిస్థాయిలో, ప్రాక్టికల్ పరీక్షల అధిక అక్రమ ఫీజుల వసూలు చేస్తూ ఫీజుల దందాకు తెగబడ్డాయని, అక్రమ ఫీజుల దందాను అరికట్టడంలో రాష్ట్ర విద్యాశాఖ పూర్తిగా విఫలమైందని ఎఐయస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు యన్ ఎ స్టాలిన్ అన్నారు. గురువారం నాడు ఎఐయస్ఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇసిఐఎల్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద కార్పొరేట్ విద్యాసంస్థల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యన్ ఎ స్టాలిన్ విచ్చేసి మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు ధనార్జనే ధ్యేయంగా విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతూ పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లిస్తేనే ఆన్లైన్ తరగతులకు అనుమతులు ఇస్తున్నారని, లేనిపక్షంలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ వలన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెల్సిందే అయినా ఇవేమీ వారికి పట్టనట్లుగా వ్యవహారిస్తూ విద్యార్థుల నుంచి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు సంబంధిత కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకొకపోవడం బాధకరమని అన్నారు. జి.ఒ.నెం. 46 ను ఉల్లంఘించిన విద్యాశాఖ అధికారులు చోద్యం చూడడం విడ్డూరంగా ఉందన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల కబంధ హస్తాలల్లో రాష్ట్ర విద్యాశాఖ ఉందని, అందుకనే అధిక అక్రమ ఫీజులు వసూళ్లు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు మొత్తం ఫీజులు తీసుకొని ఆయా విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాద్యాయులకు, లెక్చరర్లకు జీతాలు ఇవ్వడం లేదని, అదేవిధంగా సగానికీ పైగా ఉద్యోగులను తొలగించారని అన్నారు. కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షల పేరుతో అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఎఐయస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేయడంతో పాటు అక్రమ ఫీజులను వసూలు చేస్తున్న ఆయా విద్యాసంస్థలపై దాడులు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎఐయస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుట్ట లక్మణ్, రాష్ట్ర నాయకురాలు కాసోజు జ్యోతి, జిల్లా ఉపాధ్యక్షులు అన్వర్, జిల్లా నాయకులు అజేయ్, హరిష్, నవీన్, చిన్నబాబు, సందీప్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *