janaprabha

janam kosam manam

నరేంద్ర మోడీ ఉగ్ర చర్యలు విరమించుకోవాలి

1 min read

నరేంద్ర మోడీ ఉగ్ర చర్యలు విరమించుకోవాలి

వ్యవసాయ చట్టాలను భేషరుతుగా ఉపసంహరించుకోవాలి

మేడిపల్లి ఫిబ్రవరి 6,(జనప్రభ):

కేంద్రం లోని నరేంద్రమోదీ సర్కార్ తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు దేశ వ్యాప్తంగా తలపెట్టిన రాస్తారోకో కార్యక్రమం ఉప్పల్ బస్ డిపో ప్రధాన రహదారి పై భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ), భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) సమితుల ఆధ్వర్యంలో రహదారిపై బైఠాయించి, మోడీ నిరంకుశ చట్టాల ను రద్దు చేయాలని నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం రాస్తారోకో నిర్వహించిన అల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్. బోస్ తదితర నేతలను,కార్యకర్తలను అరెస్టు చేసి మేడిపల్లి ఠాణాకు తరలించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్. బోస్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని, నయా ఉదారవాద విధానాలతో కార్పొరేట్ అనుకూల చట్టాలను రూపొందించి,చట్ట సభల్లో ఆమోదింపజేసి దేశాన్ని కార్పొరేటర్లకు ధారాదత్తం చేసే కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని బోస్ దుయ్యబట్టారు. అదేవిధంగా అంబానీ,ఆదానీ కనుసన్నల్లో మోడీ సర్కార్ పయనం సాగుతున్నదని,ప్రజా అనుకూల నిర్ణయాలను చేయడంలో మోడీ విఫలం చెందుతున్నారు అని వారు ఎద్దేవా చేశారు. రెండు నెలలుగా దేశ రాజధాని ఢిల్లీలో రాజీలేని పోరాటం నిర్వహిస్తున్న రైతుల న్యాయబద్ధమైన ఉద్యమానికి తాము పూర్తి మద్దతు ను ప్రకటిస్తున్నామని బోస్ తెలిపారు.అనంతరం తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు ch. దశరథ్, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కోమటి రవి మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, మోడీ ప్రభుత్వం ఛాందస విధానాలను అవలంబిస్తున్నారని వారు అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు తాము పోరాటాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టంచేశారు.ఈ రాస్తారోకో కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేష్, దశరథ్, లక్ష్మీ,నర్సింహా…..సీపీఎం నేతలు యాదయ్య, వెంకట్, సబితా, జీ.శ్రీనివాస్, వై. శ్రీనివాస్, వినోదా…… సీపీఐ మేడిపల్లి మండల సీనియర్ నేతలు ముడి మార్టిన్, వి. బి. బాలరాజు, రచ్చ కిషన్, దండు రమేష్, అశోక్, ప్రమీల, మాధవి, కమలమ్మ, యాదమ్మ, మహేశ్వరి, జానమ్మ, గణేష్, యాదగిరి, ….అఖిల భారత యువజన సమాఖ్య(AIYF) మేడ్చల్ జిల్లా అధ్యక్షులు టి.సత్య ప్రసాద్, సహాయ కార్యదర్శి ధర్మేంద్ర…. అఖిల భారత విద్యార్థి సమాఖ్య(AISF) జిల్లా అధ్యక్షుడు విశాల్, కార్యదర్శి లక్ష్మణ్…నేతలు అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం పోలీసులు అరెస్ట్ చేసిన నేతలను సొంత పూచీకత్తు పై విడుదల చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *