janaprabha

janam kosam manam

వ్యక్తి అదృశ్యం

వ్యక్తి అదృశ్యం

మేడిపల్లి ఫిబ్రవరి 5,(జనప్రభ):

ఫిర్జాదిగూడ కార్పొరేషన్ కు చెందిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిర్జాదిగూడ కార్పొరేషన్ బండి గార్డెన్ దగ్గర నివాసముండే డి సతీష్ (37) బీర్ గోదాంలో పనిచేసేవాడు. గత 15 రోజులుగా రక్త ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఉప్పల్ లక్ష్మీ ప్రియ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. ఫిబ్రవరి 5న చికిత్స కోసం వెళ్తున్నాను అని ధైర్యం చెప్పి బయటికి వెళ్లి సుమారు 12 గంటల సమయంలో నేను ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను. నీవు జాగ్రత్త అని భార్యకు ఫోన్ చేసి సందేహం పంపి ఫోన్ స్విచ్చాఫ్ చేయడం జరిగింది. చుట్టుపక్కల బంధువులలో ఎక్కడ వెతికిన జాడ దొరకకపోవడంతో మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *