janaprabha

janam kosam manam

25 వ డివిజన్ లో సిసి రోడ్లు ప్రారంభించిన మేయర్ డిప్యూటీ మేయర్

1 min read

25 వ డివిజన్ లో సిసి రోడ్లు ప్రారంభించిన మేయర్ డిప్యూటీ మేయర్

మేడిపల్లి ఫిబ్రవరి 4, (జనప్రభ):

గురువారం పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్ విహరిక కాలనీ రోడ్డు నెం.3లో SC & ST గ్రాంట్ రూ౹౹18.00లక్షలతో వ్యయంతో సి.సి రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి కలిసి మేయర్ జక్కా వెంకట్ రెడ్డి డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ తో కలిసి కొబ్బరి కాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేషన్ ను తెలంగాణ రాష్ట్రంలోని అభివృద్ధి లో అగ్రగామిగా నిలబడతానని అన్నారు. డివిజన్లో ఏ సమస్య ఉన్నా నాకు తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలియజేశారు.
ఈ ప్రారంభోత్సవంలో కో-ఆప్షన్ సభ్యులు షేక్ ఇర్ఫాన్, నాయకులు జావిద్ ఖాన్, సునీల్,చంద్రశేఖర్, కాలనీ వాసులు, వార్డ్ పెద్దలు, తదితరులు… పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *