janaprabha

janam kosam manam

అక్రమ కేసుల సంగతి మేము చూసుకుంటాం..

1 min read

అక్రమ కేసుల సంగతి మేము చూసుకుంటాం..

తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బత్తిని సుమన్ గౌడ్.
మేడ్చల్ జిల్లా ప్రతినిధి జనవరి 29,(జనప్రభ):
తెలంగాణ రాష్ట్రం లో జర్నలిస్టుల పై పెట్టిన అక్రమ కేసుల సంగతి మేము చూసుకుంటాం అని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బత్తిని సుమన్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కూకట్ పల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి కమిటీ హాల్ లో తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం,రాజ్ న్యూస్ తెలుగు చానెల్ ఆధ్వర్యంలో జనవరి 30న ఏర్పాటు చేస్తున్న చర్చా-గోష్ఠి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు సోదరులు యునియన్లకు, అసోసియేషన్ లకు సంబంధం లేకుండా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.సోమవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ఆనాడు అక్షరాన్ని అగ్ని కణంలా మార్చి రజాకార్ల గుండెల్లో గుబులు పుట్టించిన షోయబుల్లాఖాన్ ని నిజాం నవాబులు అతికృరంగా ఆత్య చేశారు.నేడు అదే పద్ధతి తెలంగాణ రాష్ట్రంలో కోనసాగుతుంది నిజాన్ని నిర్భయంగా రాసినందుకు జర్నలిస్టు లను జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అని ఆయన విచారణ వ్యక్తం చేశారు.జర్నలిజన్ని అదుపు చేయడానికి పోలీసులను పావులుగా వాడుకోవడం రాష్ట్ర ప్రభుత్వంకు పరిపాటిగా మారిందని ఆయన పేర్కోన్నారు. నిజానిజాలతో సంబంధం లేకుండా అక్రమ కేసులతో జర్నలిస్టు లపై ఉక్కు పాదం మోపాలని చూస్తున్న గడీల పాలనకు చరమగీతం పాడే రోజు ఆసన్నం అయ్యిందాని ఆయన ఉద్ఘాటించారు. షోయబుల్లాఖాన్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మాకు అక్రమ కేసులకు, బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. అక్రమ కేసులతో సతమతం అవుతున్న రాష్ట్ర జర్నలిస్టు సోదరులు జనవరి 30న కూకట్ పల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్.ఎం.టి. కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేస్తున్న చర్చా-గోష్ఠి కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *