janaprabha

janam kosam manam

గొర్రెలకు బదులు నగదు బదిలీ చేయాలి..

మహబూబాబాద్ జిల్లా
తొర్రూరు జనవరి11

గొర్రెలకు బదులు గొల్ల కురుమల ఖాతాలకు నగదు బదిలీ చేయాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తొర్రూరు మున్సిపల్ పట్టణంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గర అమరవీరుల స్తూపం ముందు గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం 2021 నూతన క్యాలెండర్ ను తొర్రూరు మున్సిపల్ వార్డు కౌన్సిలర్ లు బుసాని రాము, కొలుపుల శంకర్, యాదవ సంఘం సీనియర్ నాయకులు మేకల కుమార్, కొండ నాగమల్లయ్య, చెవిటి సధాకర్ లతో కలిసి అశోక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం (జీఎంపీఎస్) ఆధ్వర్యంలో గొర్రెల పంపిణీ చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాలలో ఆందోళనలు, పోరాటాలు చేశామన్నారు. ఛలో అసెంబ్లీ, ముఖ్యమంత్రి ఇంటికి ఉత్తరాలు, సెప్టెంబర్ 21న తెలంగాణ ప్రగతి భవన్ ముట్టడి, అక్టోబర్ 12న రాష్ట్రంలో ఎనభై ఆరు కేంద్రాల్లో గొర్రెలతో రోడ్ల దిగ్బంధం లాంటి అనేక కార్యక్రమాలతో ఉద్యమాలు చేసిన ఫలితంగా ప్రభుత్వం స్పందించిందిఅన్నారు.ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి వెంటనే గొర్రెల పంపిణీ చేపట్టాలని ఆదేశించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. రెండేండ్ల క్రితం అప్పులు చేసి గొర్రెల కోసం డి.డి.లు తీసి ఇప్పటికే ఒక్కొక్కరు 20 వేల రూపాయలకు వడ్డీ చెల్లించారన్నారు. వారికి ఇప్పుడు గొర్రెలిస్తే లాభం ఉండదు. కావున ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా గొల్లకురుమల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల లోకి నేరుగా నగదు బదిలీ చేసి గొల్ల కురుమలను ఆదుకోవాలన్నారు. గతంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల ముందు ఇలాగే గొర్రెల పంపిణీ చేస్తామని హామీలు ఇచ్చి మోసం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల కోసమే ప్రకటించి మళ్లీ మోసం చేయాలని చూస్తే మాత్రం గొల్లకురుమలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ ఉద్యమంలో పోలీసుల అరెస్టులు, నిర్బంధాలు, కేసులు, బెదిరింపులు, రాజకీయ ఒత్తిళ్లకు భయపడకుండా పోరాడిన కురుమ యాదవులందరికీ అభినందనలు, జేజేలు తెలుపుతున్నామన్నారు. ఎన్నికల పేరుతో హామీలు ఇచ్చి మళ్లీ కాలయాపన చేస్తే మాత్రం సహించబోమని అన్ని ప్రజాసంఘాల కుల సంఘాలు రాజకీయ పార్టీలు అందరినీ ఏకం చేసి ఈ ప్రభుత్వంపై ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ నాయకులు గజ్జి యాకయ్య, మేకల మహేందర్, మద్దెల సంతోష్ కుమార్, ఎద్దు మహేష్, ఆవుల మహేష్, ఆవుల సతీష్, నూకల హరీష్, జమ్ముల శ్రీనివాస్, బొల్లు రాములు యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *