janaprabha

janam kosam manam

చలో కోదాడ మాదిగ జర్నలిస్టుల జాతీయ మహాసభ

 

మహబూబాబాద్ జిల్లా
జనవరి 24,
మహబూబాబాద్ జిల్లా మాదిగజర్నలిస్ట్ జాతీయ మహాసభ కు ఆదివారం జిల్లా కేంద్రంలో ఉన్న దంతాలపల్లి మరిపెడఆయా మండలాల నుండి మాదిగ జర్నలిస్టుల చలో కోదాడ జాతీయ సభకు తరలి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా మాదిగ జర్నలిస్టు సోదరులు మాట్లాడుతూమాదిగ జర్నలిస్టుల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేసి జర్నలిస్టులు హక్కులను కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తుందని వారు అన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ జర్నలిస్టుల జాతీయ మహాసభ నిర్వహిస్తున్న సందర్భంగా మాదిగ జర్నలిస్టు ఫోరం మాదిగ జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్టు ఫోరం జిల్లా నాయకులు జిన్నా లచ్చన్న వంకాయలపాటి తిరుమలరావు పంతం సురేందర్ సంఘం నాయకులు ఈ సం పల్లి సాయి కుమార్ అయినాల రాజేష్ మిట్టపల్లి సురేందర్ మైదా శ్రీనివాస్ మంద విక్రమ్ తుడుంరాజేష్ మిడతపల్లి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *