ఈదురు రాజేంద్రప్రసాద్ కు డాక్టరేట్

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి జనవరి18,
పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన రాజేంద్ర ప్రసాద్ కు హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జనవరి 4 సోమవారం డాక్టరేట్ ను ప్రకటించింది. ఈ సందర్భంగా ఈదురురాజేందర్ మాట్లాడుతూ తను విశ్వవిద్యాలయంలోని తులనాత్మక అధ్యయన కేంద్రంలో పాల్కురికి సోమనాథుని బసవ పురాణం శెక్కిళరు పెరియ పురాణం అనే అంశంపై పరిశోధన చేసి నందుకు గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదులో డాక్టరేట్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అని పత్రికా ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు వీరన్న ప్రముఖ కవి విమర్శకులు కళారత్న డాక్టర్ శిగామణి పర్యవేక్షణలో ఈ పరిశోధన జరిగింది. ఆబ్యో సంపత్ కుమార్ ఆచార్య అరుణకుమారి ఆచార్య సుదర్శన్ రాజు ఈ పరిశోధనకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. డాక్టరేట్ ను ప్రకటించిన పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయ ఆచార్యుల అందరికీ ఈదురు రాజేంద్రప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. నా శ్రమకు తగ్గ గుర్తింపు లభించిందని అందుకనే విశ్వవిద్యాలయం డాక్టరేట్ తనకుప్రకటించిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ డాక్టరేట్ ను సంపాదించడంతో తన స్వగ్రామం పెద్దముప్పారం కావడంతో ఆగ్రామస్తులు అతనికి అభినందనలు తెలిపారు.