janaprabha

janam kosam manam

కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి: తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్ నాయక్.,…

మహబూబాబాద్ జిల్లా
తొర్రూర్ జనవరి 16,

కార్పొరేట్ అనుకూల నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంతవరకు ఈ పోరాటం ఆగదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్ నాయక్ అన్నారు. శనివారం తొర్రూరు పట్టణ కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్సు జాత ఈరోజు తొర్రూరు పట్టణానికి చేరుకుంది. అన్నారం రోడ్డు సెంటర్లో జాత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వై వెంకటయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో శోభన్ నాయక్ మాట్లాడుతూ,నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేయకపోగా మరింత నష్టం చేసేవిగా ఉన్నాయని కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయంలోకి వ్యవసాయ ఉత్పత్తులు ప్రాసెసింగ్ యూనిట్ లోకి చొరబడి రైతాంగం నుండి కారు చౌకగా కొనుగోలు చేసి వినియోగదారులకుఅధిక ధరలకు అమ్ముకొని లాభాలు గడించి కునేందుకు ఉపయోగపడుతున్నాయని నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టం మొత్తం భారత ప్రజానీకానికి వ్యతిరేకమైనది ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉపయోగపడేవిగా ఉన్నాయి.కానీ మోడీకి ఎముకలు కొరికే చలిలో సైతం లెక్క చేయకుండా ఆందోళన చేస్తున్న రైతు పోరాటాలు మాత్రం కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఈ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే అంత వరకు ఈ పోరాటాలు ఆగవని రోజు రోజుకు మరింత ఉధృతం అవుతాయని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గునగంటి రాజన్న శేట్టీ వెంకన్న, బొల్లం అశోక్ ,యం డి యాకుబ్, సోమిరెడ్డి, ఈ జాత కు సిపిఐ మండల కార్యదర్శి గట్టు శ్రీమన్నారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చెవిటి సుధాకర్, హరీష్ రాహుల్ సంఘీభావం తెలిపారు. సి ఐ టి యు మండల నాయకులు జమ్ముల శ్రీను ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులు మాలోత్ సురేష్ బాబు డివైఎఫ్ఐ మండల నాయకులు నజీర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *