janaprabha

janam kosam manam

సారు ఏంటి మా గ్రామ రోడ్ల తీరు

సారు ఏంటి మా గ్రామ రోడ్ల తీరు

మహబూబాబాద్ జిల్లా
పెద్దవంగర ఫిబ్రవరి 5,(జనప్రభ):

సారు ఏంటి మా గ్రామ రోడ్ల తీరు కొరిపల్లి గ్రామ ప్రజలు అంటున్నారు.
పెద్దవంగర మండలంలోని కొరిపెల్లి గ్రామంలో ఉపాధిహామీ కింద చేపడుతున్న రోడ్ల నిర్మాణాలు నాసిరకంగా జరుగుతు న్నాయి. నాణ్యత ప్రమాణాలకు గండి కొడుతూ గుత్తెదార్లు పనులను ఆగమాగం చేస్తున్నారు. గ్రామీణ రోడ్ల నిర్మాణ పనులను అధికారులు పరిశీలించక పోవడంతో కాంట్రాక్టర్లకు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. కోట్లాది రూ పాయలను వెచ్చించి బిటి, సిసి రోడ్లు మూన్మాళ్ల ముచ్చటగా మారాయి. బిటి రోడ్లుపై అప్పుడే కంకర తేలుతుండగా, సిసి రోడ్లు కాస్తా అడ్డంగా పగుళ్లు తీశాయి. మట్టి రోడ్లు కొట్టుకుపోతున్నాయి. రోడ్ల నిర్మాణాల్లో అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉండాలి…గుత్తెదారులు నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉండాలి… అందుకు పాటించాల్సిన పద్దతులు…పనులలో పారదర్శకత… పనులను అందించడం వాటికి సంబంధించి గుత్తెదారులు చెప్పినట్లుగా ఎంబి రికార్డులు పూర్తి చేయడం…
తదుపరి వారికి బిల్లులు జారీ చేయడంతోనే అ ధికారులు సరిపెట్టుకుంటున్నారు. కమిషన్లకు ప్రాదాన్యత నిస్తూ నాణ్యతకు తిలోదకాలిచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. పది కాలాల పాటు పక్కాగా ఉండాల్సిన రహదారులు మూన్నాళ్లకే పగుళ్లు తీస్తున్నాయి. మండలంలో వెనుకబడ్డ కొరిపల్లి గ్రామంలో ఈ విధమైన దుస్థితి కనిపిస్తోంది.జిల్లాలో గ్రామాల్లో జరిగే రోడ్ల పనులను అధికార పార్టీకి చెందిన నేతలే కాంట్రాక్టులు తీసుకోవడంతో నాణ్యతకు గండి కొట్టే అవకాశం ఏర్పడుతోంది. క్షేత్ర స్థాయిలో అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి వారి పనులను సాఫీగా జరిపించుకునేందుకు వీలు కలుగుతోంది. ఉపాధి హామీ కింద చేపడుతున్న పనులకు కూడా వారే దిక్కయ్యారు. ఇతరులకు చోటు లేకుండా చేసి పనులు చేసుకుంటున్నారు.తేది:04.02.2021 రోజున క్వాలిటీ కంట్రోల్ కమిటీ మెంబర్ సురేంద్ర, రామదాసు గార్లు, ఈజీఎస్ పనుల పర్యవేక్షణ కోసం ఎటువంటి సమాచారం లేకుండా గ్రామాన్ని సందర్శించారు… దేనికోసం వచ్చారని గ్రామస్థులు అడుగగా ,మీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అని , దురుసుగా అధికారులు ప్రవర్తించిన సందర్భంగా గ్రామస్థులు నిరసనగా వారి వాహనాన్ని అడ్డుకున్నారు…. అయినప్పటికీ వచ్చిన సమాధానం ఇవ్వలేదు… కావున బాధ్యతారహితంగా మాట్లాడిన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టర్ పైచర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో గ్రామ ఉపసర్పంచ్ ఊట్ల వీరారెడ్డి, టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఆరుట్ల వెంకట్ రెడ్డి, వార్డ్ సభ్యులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *