వాహన తనిఖీ నిర్వహించిన సీఐ

వాహన తనిఖీ నిర్వహించిన సీఐ
తొర్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్
మహబూబాబాద్ జిల్లా
దంతాలపల్లి ఫిబ్రవరి 4,(జనప్రభ):మహబూబాబాద్ జిల్లా దంతాల పల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారంసాయంకాలం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ కరుణాకర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. వాహనదారులకు లైసెన్సు వాహనానికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు.అదేవిధంగా వాహనదారులకు ట్రాఫిక్ నియమ నిబంధనలు తెలియపరిచారు. మద్యం తాగి గాని లైసెన్స్ గాని వాహనానికిసంబంధించిన పత్రాలు గాని లేనియెడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కృష్ణ చిరంజీవి పాల్గొన్నారు