రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలీ అఖిలభారత రైతు సంఘాల పోరాట సమన్వయ సమితి (Aikcss)
1 min read
రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలీ
అఖిలభారత రైతు సంఘాల పోరాట సమన్వయ సమితి (Aikcss)
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జనవరి 30,(జనప్రభ):
కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు తొర్రూరు పట్టణ కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి, అనంతరం లయన్స్ క్లబ్ భవన్లో లో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.ఈ దీక్షలను ఉద్దేశించి రైతు సంఘాల నాయకులు తమ్మెర విశ్వేశ్వరరావు కొత్తపెళ్లి రవి బొల్లం అశోక్ లు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు, బడా పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా పార్లమెంటులో సంఖ్యాబలం ఉందని నల్ల చట్టాలను చేస్తూ రైతాంగం నడ్డి విరిచే లా చేస్తున్నదని తక్షణమే ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిన్న ఢిల్లీలో రైతాంగం చేస్తున్న దీక్షల్లో అసాంఘిక శక్తులుగా దూరి బిజెపి కార్యకర్తలు ,ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రైతాంగ పై అమానుషంగా పోలీసు వేషధారణతో లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గమైన చర్య అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసి వ్యవసాయాన్ని అభివృద్ధి పదంలో నడిచే విధంగా రైతుల క్షేమం కోరి ఆ చట్టాలను రద్దు చేయాలని, రైతు సంఘాల నాయకుల పై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని లేనియెడల రైతులకు మద్దతుగా దేశ వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు ఉధృతం అవుతాయని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు .ఈ దీక్షా శిబిరంలో రైతు నాయకులు శ్రీమన్నారాయణ, ఎండి యాకుబ్, ముంజ పల్లి వీరన్న ,బందు మహేందర్, శ్రీను, గణపురం లక్ష్మణ్ సైదులు, సంపత్, చిన్న బాబు, లాలు, తాళ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.