janaprabha

janam kosam manam

తొర్రూర్ లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం

*తొర్రూర్ లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం*

మహబూబాబాద్ జిల్లా
తొర్రూర్ జనవరి26,(జనప్రభ):
మహబూబాద్ జిల్లా తొర్రుర్ పట్టణ కేంద్రంలో సాయి మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ నందు అరోగ్యశ్రీ సేవలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డాక్టర్ స్వరూప్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రజలు ఈ ఆరోగ్య శ్రీ సేవలను సద్వినియొగం చేసుకోవాలని అన్నారు,తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు అర్హులేనని అన్నారు,ఆర్థోపెడిక్ మరియు న్యూరో సర్జరీ,న్యూరాలజీ విభాగాల కు ఆరోగ్యశ్రీ సేవలు అందించబడునని తెలియజేసారు ఈ కార్యక్రమం లో ,మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య జెడ్ పి టి సి ,టీఎస్పీఎస్సీ చైర్మన్ కాకిరాల హరి ప్రసాద్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు బిజ్జాల మాధవి అనిల్ భూసాని రాము సంగీత రవి శ్రీనివాస రావు వుహాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పొద్దుటూరిగౌరీశంకర్, డాక్టర్లు నాగరాజు,సాయిభార్గవ్,నరేష్,వేణుమాధవ్,కిషోర్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *