janaprabha

janam kosam manam

తొర్రూర్ ఎల్ వై ఆర్ గార్డెన్ లో పట్టభద్రుల సమావేశం

తొర్రూర్ ఎల్ వై ఆర్ గార్డెన్ లో పట్టభద్రుల సమావేశం

మహబూబాబాద్ జిల్లా
పెద్దవంగర జనవరి 26,(జనప్రభ)

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం కేంద్రంలో పట్టభద్రుల సమావేశం జనవరి 28 గురువారం రోజున ఎల్ వై ఆర్ గార్డెన్ లో ఉదయం 10:00 గంటలకు సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని పెద్దవంగర మండలం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆపార్టీ మండల అధ్యక్షులు ఈదురుఐలయ్య అన్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరవుతున్నారని వారు తెలిపారు. కావున పెద్ద వంగర మండలంపట్టభద్రులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి పెద్ద వంగర మండలం టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు గ్రామ పార్టీ అధ్యక్షులు ఎంపీటీసీలు పి ఎస్ సి ఎస్ డైరెక్టర్లు యూత్ నాయకులు పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దవంగర టిఆర్ఎస్ మండల పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *