janaprabha

janam kosam manam

తల్లిదండ్రులు తమ తమ పిల్లలకు తప్పనిసరి వ్యాక్సీన్ వేయించాలి. —– ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.

1 min read

హైదరాబాద్ / ఎల్బీనగర్:

శుక్రవారం ఉదయం ఎల్బీనగర్ ఎమ్మెల్యే మరియు చైర్మన్,యం.ఆర్.డి.సి.యల్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని పలు కళాశాలలో 15-18 సంవత్సరాల విద్యార్థులకు టీకా కేంద్రాలు ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ సందర్బంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ…..
ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్స్ వ్యాక్సినేషన్ కోసం తమ,తమ విద్యార్థుల వివరాలు తమ కార్యాలయంలో ఇవ్వాలని తెలిపారు.ప్రభుత్వ హాస్పిటల్ నర్సింగ్ సిబ్బందితో పాటు అదనంగా మరో 20 మంది ప్రైవేటు సిబ్బందిని కేటాయించడం జరిగిందని అన్నారు.సంక్రాంతి పండగ సెలవుల దృష్ట్యా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేయడం జరుగుతుందని తెలిపారు. 15 సంవత్సరాల పైబడిన పిల్లలందరికీ కరోనా బారిన పడకుండా ఉచిత వ్యాక్సిన్ ఇస్తున్న విషయం మీ అందరికీ తెలిసినవిషయమే. కావున ముఖ్యంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో అనేక మంది 15 సంవత్సరాలు పైబడిన చిన్నారులు ఈ వ్యాక్సిన్ కోసం వివిధ సెంటర్లకు రావడం క్యూలైన్లలో నిలబడడం వల్ల మరింత ప్రబలే అవకాశం ఉన్నది.15 సంవత్సరాలు నిండి “కోవిన్ యాప్” లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి విద్యార్థినీ,విద్యార్థులకు అదే కళాశాల ప్రాంగణంలో ఆరోగ్య శాఖ ద్వారా ఉచిత వ్యాక్సిన్ ఇప్పించేలా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. వారితో పాటు ఆ కళాశాల కాకున్నా 15 సంవత్సరాలు పైబడిన వారి కుటుంబ సభ్యులు కూడా తోడుగా ఉండాలని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మూడో రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆయా కళాశాలల ప్రాంగణాలలో మొదలు కావడం జరిగింది,కావున విద్యార్థిని,విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను వ్యాక్సిన్ వేయించుకునే విధంగా వారిని మానసికంగా సన్నద్ధం చేయాలని,ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా,భావి భారత పౌరుల ఆరోగ్య పరిరక్షణకు చేయూతనివ్వాలని కోరుతున్నాను.రోజురోజుకు తీవ్రంగా ప్రబలుతున్న “ఓమైక్రాన్ వైరస్” నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేరుపేరునా విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.దానిలో భాగంగా..గడ్డిఅన్నారం,చైతన్య పురి నందు ఉన్న పలు కళాశాలలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం కూడా స్వచ్చందంగా పలువురు నర్సులను టీకాలు వేయడం కోసం ఇవ్వడం జరిగింది అని తెలిపారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం.ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి,రాజు,రవి కిరణ్,నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *