janaprabha

janam kosam manam

బాధ్యత గా 15-18 సంవత్సరాల బాలబాలికలు టీకా వేయించుకోవాలి. —— ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.

1 min read

హైదరాబాద్ / ఎల్బీనగర్:

బాధ్యత గా 15-18 సంవత్సరాల బాలబాలికలు టీకా వేయించుకోవాలని ఎల్బీనగర్,ఎమ్మెల్యే మరియు చైర్మన్,యం.ఆర్.డి.సి.యల్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. “కరోన మూడవ దశ”  “ఓమైక్రాన్ వైరస్” క్షణక్షణం తీవ్రరూపం దాల్చుతూ ప్రజారోగ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్న తరుణంలో 15 సంవత్సరాలు పైబడిన పిల్లలందరికీ వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.మొదలు నిర్ణయించిన ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ నిర్ణీత వ్యాక్సిన్ సెంటర్ల ద్వారానే ఈ కార్యక్రమం చేపట్టవలసి ఉంది.కానీ వేల సంఖ్యలో ఉన్న విద్యార్థులకు తక్కువ సంఖ్యలో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్ల ద్వారా ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుందని వీలైనంత తొందరగా ఈ వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాలంటే ఇంకా సెంటర్లు పెంచవలసిన అవసరం ఉన్నదని భావించడం జరిగిందని అన్నారు.దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలను సంప్రదించి ఆయా ఆసుపత్రుల నుండి డాక్టర్లు,నర్సులు,ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయింప చేసుకొని ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అనేక ప్రభుత్వ కళాశాలల,ప్రైవేటు కళాశాలల విద్యార్థిని,విద్యార్థులకు నిర్దేశిత సమయం కన్నా అతి తక్కువ సమయంలోనే వేలాది మంది విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాక్సిన్లు ఇచ్చే ప్రక్రియ పరిపూర్తి చేయడం జరిగింది.ముఖ్యంగా వివిధ కళాశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థినీ,విద్యార్థులను వారి బావితత్వాని దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్కరికి ఈ వ్యాధి సోకినా తరగతి గదులలో ఉన్న ఇతర విద్యార్థులతో పాటు కళాశాల మొత్తం వైరస్ బారిన పడే అవకాశం ఉన్నది.ప్రభుత్వ నిర్దేశిత వ్యాక్సిన్ సెంటర్ లో సిబ్బంది కొరత ఉండటంతో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఓమ్ని,గ్లోబల్,ఓజోన్,పారమిత,శ్రీ లక్ష్మి తదితర ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు సంపూర్ణంగా సహకరించి వారి సిబ్బందిని కేటాయించి వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతానికి చేయూతనిచ్చారు.అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు,వైద్యాధికారులు,నర్సులు పారామెడికల్ సిబ్బంది ఎంతో శ్రమకోర్చి తమ సేవలను అందించారు.అనునిత్యం తీవ్రంగా ప్రబలుతున్న “ఓమైక్రాన్ వైరస్” విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మీరు క్షేమంగా ఉంటూ ఇతరులు క్షేమంగా ఉండేలా చూడాలని,అత్యవసరం కానీ పనులన్నింటినీ వాయిదా వేసుకోవాలని ఫంక్షన్లకు,వేడుకలకు పరిమిత సంఖ్యలో హాజరుకావాలని కోరుతున్నాను. మనం ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మరో “లాక్ డౌన్” దిశగా అడుగులు వేసే ప్రమాదం పొంచి ఉన్నది.ఇప్పుడిప్పుడే కరోన మొదటి దశ,రెండవ దశ తీవ్రత నుండి,లాక్ డౌన్ ల నుండి సాధారణ జన జీవనం కొంత మెరుగైంది.ఇలాంటి పరిస్థితులలో ఈ వైరస్ ప్రబలితే ప్రభుత్వాలు విధించే లాక్ డౌన్ లు జన జీవితాలను అస్తవ్యస్తం చేస్తుంది.పేద,మధ్యతరగతి,దిగువ మధ్యతరగతి ప్రజలు బ్రతకడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.వీటిని దృష్టిలో ఉంచుకొని లాక్ డౌన్ దిశగా పయనించకుండా మనల్ని మనం నియంత్రించుకోకపోతే జరిగే పరిణామాలకు మనమంతా మూకుమ్మడిగా బాధ్యత వహించాల్సి వస్తుంది.గత రెండు సంవత్సరాలుగా ప్రత్యక్షంగా,పరోక్షంగా కరోన వైరస్ వల్ల మనమంతా ఎదుర్కొన్న బాధలు,కష్టాలు మళ్లీ మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందని అనుకోవడం లేదు.పై అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరంతా సముచిత నిర్ణయం తీసుకొని ప్రజారోగ్యం పట్ల మీ బాధ్యతను,బాధ్యత గల పౌరులుగా మీ విధులను నెరవేరుస్తారని ఆశిస్తున్నాను అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *