janaprabha

janam kosam manam

కూకట్ పల్లి పరిధిలో అక్రమ భవనం సీజ్‌

1 min read

కుకట్ పల్లి జనవరి 22, కుకట్ పల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ప్రభుత్వ నియమనిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడుతున్న అక్రమ భవనంపై  కూకట్ పల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారులు నోటీసులు ఇచ్చి సీజ్‌ చేశారు. డిప్యూటీ కమిషనర్‌ ప్రశాంతి ఆదేశాల మేరకు టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారులు శుక్రవారం దాడులు చేపట్టి పక్కా ప్రణాళికలతో అనుమతులకు మించి చేపట్టిన నిర్మాణాలతో పాటు, అనుమతులు లేకుండా యథేచ్ఛగా చేపట్టిన నిర్మాణాన్ని కూకట్ పల్లి లోని (ఇంటి నెంబర్:5-3-31/B) రామాలయం దేవస్థానం దగ్గర ఉన్నటువంటి అక్రమ భవన నిర్మాణాన్ని ఇతర ప్రాంతాల్లో పలు అక్రమ భవనాలను గుర్తించారు. సంబంధిత టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అక్రమంగా వెలిసిన అక్రమ భవనాన్ని సీల్‌ చేసి గృహయజమానులకు నోటీసులను జారీ చేశారు. ప్రభుత్వ నియమనిబంధనలను వ్యతిరేకించి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై చట్టరీత్య తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *