janaprabha

janam kosam manam

ఆరోపణలు అవాస్తవం…

1 min read

ఆరోపణలు అవాస్తవం
నిరూపిస్తే దేనికైనా సిద్దం….
సోదర సోదరీ మణులకు మనవి…
నా పేరు రెడ్డి సతీష్ అరోరా కూకట్పల్లి నియోజకవర్గం trs co.. ordinator గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.. రాజకీయంగా నా ఎదుగుదలను గిట్టని వారు లేని పోని ఆరోపణలతో నా రాజకీయ భవిష్యత్ పై బురద జల్లుతున్నరు. నా 48 ఏళ్ళ చరిత్రలో ఏ నాడూ కూడా ఒక్క చిన్న పిట్టి కేసూ కూడా లేకుండా రాజకీయంగానూ, వ్యాపార పరంగానూ ఎదుగుతూ వస్తున్నాను. ఇటీవల అనగా రెండు నెలల క్రితం నేనూ నా మిత్రుడు ఇద్దరం కలసి కారులో వెళ్తుండగా ఓ గుర్తు తెలియని మహిళ ఫోన్ చేసి అకారణంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడింది. ఫోన్ నెంబర్స్ మారుస్తూ ఫోన్ చేసి దూసించడంతో కే.పి హెచ్బి. పోలీసులకు పిర్యాదు చేయడం జరిగింది. అప్పటి నుంచీ ఇప్పటి వరకు కూడ నేను ఆ విషయం మళ్లీ పట్టించు కోలేదు. నేనూ గాని నా మిత్రులు గాని ఏ నాడూ ఏ మహిళకు ఫోన్ చేసి వేధించలేదు. కనీసం దురుసుగా కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. కేవలం నా మిద బురదజల్లాలనే కుట్రతో ఆరోపణలు చేస్తున్నారని వాటిని సోషల్ మీడియాలో పెట్టీ నా పేరుకు మచ్చ తేవాలని చూస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. కావున నేను కూడా సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ మీడియా ద్వారా బహిరంగ సవాల్ విసురుతున్నాను. నెను ఎవరికైనా ఫోన్ చేసి వేదించినట్లుగా, కనీసం దుషించినట్లుగా ఏ ఒక్క ఆధారం చూపినా దేనికయినా సిద్దం. కేవలం దుష్ప్రచారం కోసం నన్ను ఇబ్బందీ పెడుతూ నా పరువుకు భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం,న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా హెచ్చరిస్తున్నాను..
సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారికి కూడా పై హెచ్చరికలు వర్తిస్తాయని తెలియపరుస్తున్నము..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *