janaprabha

janam kosam manam

అక్రమ నిర్మాణాలు అడ్డుకోలేక పోతున్న అధికారులు

పాత భవనం పై కొత్త భవనం….. అక్రమం సక్రమమా?
కూకట్ పల్లి జనవరి 11,
కూకట్ పల్లి మున్సిపల్ 24 సర్కిల్ పరిధిలో అధికారులు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు. ఒక రకంగా అక్రమ నిర్మాణాలను ఎలా నిర్మించుకోవాలి అన్న దానిపై అధికారులు అక్రమ
నిర్మాణం దారులకు సలహాలు ఇస్తున్నారు అనే
విమర్శలు కూడా ఉన్నాయి. పాత భవనం పై కొత్త భవనాలు వేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం లో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఎలాంటి అనుమతులు లేకుండా నా ఇష్టంవచ్చినట్టుగా అక్రమ నిర్మాణా దారులు ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్నారు. కూకట్ పల్లి 24 సర్కిల్ మున్సిపల్ పరిధిలోని పాపారాయుడు నగర్ ఎస్ పి పెట్రోల్ బంక్ ఎదురుగా మెయిన్ రోడ్ పై అక్రమ నిర్మాణం ఏమాత్రం భవన నిర్మాణ నిబంధనలను పాటించకుండా కేవలం 150 గజాల స్థలంలోనే పాత భవనం పై కొత్తగా అనుమతులు లేకుండా అంతస్తులు
భవనాన్ని నిర్మించారు. ఈ విషయమై ఇప్పటికే పలు కాలనీలలో అసోసియేషన్ ఈ నాయకులు,ప్రజా సంఘాల నాయకులు పలు పార్టీల నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారని అయినా అధికారుల్లో ఏమాత్రం చలనం లేదనే విమర్శలుఉన్నాయి. మచ్చుకు ఇది ఒక భవనం మాత్రమేనని ఇలాంటివి కూకట్ పల్లి మున్సిపల్ సర్కిల్ పరిధిలో వందలాదిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి తీరని గండి అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సదరు అక్రమనిర్మాణంపై చర్యలు తీసుకుని, అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *