janaprabha

janam kosam manam

ఏ.వి.బి పురంలో ప్రజా ప్రతినిధి పేరు చెబుతూ అక్రమ నిర్మాణాలు

1 min read

ఏ.వి.బి పురంలో ప్రజా ప్రతినిధి పేరు చెబుతూ అక్రమ నిర్మాణాలు

హౌస్ నెంబర్: 5-5-35/32/192 అక్రమ భవనం సక్రమమా ?

* ప్రశ్నిస్తే టాస్క్ ఫోర్స్ పేరు చెప్పుకుంటూ తప్పించుకుంటున్న టీపీఓ విభాగం

* ముడుపులు ముడితే చాలు అటువైపు
చూడని ఒ చైన్ మాన్

* 24 సర్కిల్ లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై కోట్ల రూపాయల దందా…!

కూకట్ పల్లి జనవరి 10,
హైదరాబాద్ నగరంలో అక్రమనిర్మాణాలు ఒక్కటి
కూడా ఉండకుండా చూస్తామంటూ మున్సిపల్
శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు
చెబుతున్నా… నగరంలోని కొన్ని చోట్ల మాత్రం ఏ.వి.బి పురంలో హౌస్ నెంబర్: 5-5-35/32/192 అందుకు విరుద్ధంగా కొందరు భవననిర్మాణదారులు మాత్రం టిఆర్ఎస్ పేరు చెప్పుకుంటూ అనుమతులు లేకున్నా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తూ తమ సత్తా చాటుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత జిహెచ్ఎంసి అధికారులు మాత్రం టిఆర్ఎస్ నాయకులకి భయభ్రాంతులకు గురై అటువైపు తిరిగి చూడటమే మానేశారు. ప్రపంచమంతా అంటువ్యాధి
కరోనా మహమ్మారితో పోరాడుతుంటే…. వీరికి మాత్రం కరోనా భయమే లేకుండా
పోయింది. భవన నిర్మాణాలకు సరైన అనుమతులు తీసుకోకుండా ఇష్టానుసారంగా
| బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రధానంగా కూకట్ పల్లి 24 సర్కిల్
పరిధిలోని ఏ.వి.బి పురంలో హౌస్ నెంబర్: 5-5-35/32/192 యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న కొందరు బడాబాబులకు చట్టమంటే లెక్కలేకుండా పోయింది. టిఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకుంటూ అనుమతులు లేని అక్రమ భవనం నిర్మిస్తున్నాడు. ఈ వ్యక్తి అక్కడికి వెళ్లిన టౌన్ ప్లానింగ్ అధికారులను, మీడియా ప్రతినిధులను సైతం భయాందోళనకు గురిచేస్తూ దాడులకు పాల్పడుతున్నట్టు సమాచారం, ఇలా చెప్పుకుంటూ పోతే కూకట్ పల్లి మున్సిపల్ పరిధిలో చాలా చోట్ల అనుమతుల్లేని నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ అధికారులను సైతం భయాందోళనకు గురిచేస్తూ సరైన
అనుమతులు తీసుకోకుండా ఇలా భౌతిక దాడులకు పాల్పడుతున్న అక్రమనిర్మాణదారులపై కఠిన చర్యలు
తీసుకోవాలంటున్నారు స్థానిక జనం, ఇలా అక్రమ నిర్మాణాలు చేపడుతూ కూకట్ పల్లి మున్సిపల్ సర్కిల్లో చెడ్డపేరు తీసుకువస్తున్న బహుళ అంతస్తుల అక్రమనిర్మాణదారులపైనా అసోసియేషన్ సైతం చర్యలు తీసుకో వాలంటున్నారు ఇక్కడి ప్రజలు.
*అనుమతుల్లేని నిర్మాణాలను కూల్చివే యాలి*
కుకట్ పల్లి మున్సిపల్ పరిధిలో ని ఏ.వి.బి పురంలో చేపడుతున్న అనుమతుల్లేని అక్రమ భవన నిర్మాణాలను తక్షణమే. గుర్తించి, అనుమతుల్లేని అంతస్తులను పూర్తిగా తొలగించాలని స్థానిక ప్రజలు
డిమాండ్ చేస్తున్నారు. గతంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్న టౌన్ ప్లానింగ్ అధికారులకు ఇప్పుడు నిర్మిస్తున్న నిర్మణాలు కన్పించటంలేదా ? అంటూ పలువురు మండిపడుతున్నారు. ఇకనైనా నిద్రమత్తులో ఉన్న సంబంధిత అధికారులు కళ్లుతెరిచి ఈ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతారా లేక మాకెందుకులే అని మున్సిపల్ శాఖామంత్రి మాటలను సైతం బేఖాతర్ చేస్తారా ? వేచిచూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *