janaprabha

janam kosam manam

సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ

కూకట్ పల్లి:
సంక్రాంతి సెలవుల్లో కూకట్ పల్లి, కేపీఎచ్బీ ప్రాంతాల్లో తరగతులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య, శ్రీ గాయత్రీ మొదలైన కార్పొరేట్ విద్యాసంస్థలను ఏబీవీపీ కూకట్పల్లి విభాగ్ కన్వీనర్, రాష్ట్ర కార్యసమితి సభ్యులు వినోద్ హిందూస్థానీ ఆధ్వర్యంలో ఏబీవీపీ నాయకులు బంద్ చేయించారు.శ్రీ చైతన్య కళాశాల బస్సులను ఎక్కడికక్కడ రోడ్లపైనే అడ్డుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా విజృంభస్తున్న ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8 నుండి16వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు జీవో జారీ చేసినప్పటికీ, ప్రవేట్ యాజమాన్యాలు ఆ జీవోను తుంగలో తొక్కి, నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు.తరగతులు నడుపుతున్న ఆయా కళాశాలల యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని,గుర్తింపును కూడ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను, తల్లిదండ్రులను ఫీజుల కోసం వేదిస్తే ఉపేక్షించేది లేదని తెలిపారు.
పరీక్షల పేరున విద్యార్దులను ఒత్తిడికి గురి చేయడం పద్దతి కాదని,ఇప్పటికైనా కళాశాల యాజమాన్యాలు తీరుమార్చుకోవాలని హితవు పలికారు.కార్యక్రమంలో కూకట్పల్లి నగర కార్యదర్శి సనీల్, ప్రతీక్,సునీల్,అనౌక్,భరత్, జమీల్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *