janaprabha

janam kosam manam

నూతన కమిటీ ఎన్నిక

కూకట్ పల్లి:

సర్కిల్‌ దళిత ఐక్యవేదిక కేంద్ర కమిటీ అధ్యక్షుడు బోడ నర్సింగ్‌రావు, ప్రధాన కార్యదర్శి ఎడ్ల సత్యనారాయణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బండి సుధ, ఉపాధ్యక్షుడు దగ్గుపాటి వెంకటేష్‌ సమక్షంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వైజంక్షన్‌లో ఫతేనగర్‌ 118 డివిజన్‌ నూతన కమిటీని ప్రకటించారు. నూతన కమిటీ అధ్యక్షులు బడోళ్ల నగేష్, ప్రధాన కార్యదర్శి అందుగుల కవిత, ఉపాధ్యక్షులు అందుగుల మల్లేష్, బి.కూర్మయ్య, ఇ.మల్లేష్, సంయుక్త కార్యదర్శి ఎం.రథందీప్, ట్రెజర్ కె.శివకుమార్, సంయుక్త కార్యదర్శులు జె.యాదగిరి, బి.శ్రీకృష్ణ, ఆర్గనైజర్ సెక్రటరీ పి.స్వాతి, కార్యవర్గ సభ్యులు ఎస్.మహేష్, జె.నర్సింగ్, ఎం.విక్రమ్ ఉన్నారు. ఈ సందర్భముగా సెంట్రల్ కమిటీ అధ్యక్షులు బోడ నర్సింగ్ రావు, ప్రధాన కార్యదర్శి ఎడ్ల సత్యనారాయణ మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా, పార్టీలకతీతంగా ప్రాంతాలకతీతంగా దళిత జాతికి సాధ్యమైనంత వరకు మీరందరూ ఐకమత్యంతో పనిచేయాలని, మీ డివిజన్ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటన్నిటినీ క్రోడీకరించి సెంట్రల్ కమిటీ సూచనలతో ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తూ డివిజన్లో దళితులకు న్యాయం జరిగేలా వారికి అండదండలుగా ఉండాలని మన వారిని ఎప్పటికప్పుడు కలుసుకుంటూ మమేకమవుతూ పరిచయాలను పెంచుకుంటూ మన వారికి సహకరించాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *