janaprabha

janam kosam manam

విద్యార్థులు ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదు-ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యులు వినోద్ హిందూస్థానీ.

1 min read

కూకట్ పల్లి:

కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న ఈ తరుణంలో నిబంధనలకు విరుద్దంగా విద్యాసంస్థలను తెరిచి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని ఏబీవీపీ కూకట్పల్లి విభాగ్ కన్వీనర్,స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ వినోద్ హిందూస్థానీ హెచ్చరించారు.స్థానిక కూకట్ పల్లి ఏబీవీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ Rt. 01/2022 ప్రకారం ఈ నెల 8 నుండి 16 వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలను మూసి ఉంచాలని తెలిసినప్పటికీ , కొన్ని కార్పొరేట్,ప్రయివేటు విద్యాసంస్థలు తరగతులు నిర్వహిస్తున్నట్లుగా విద్యార్థులకు ,తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంలో ఫీజులు దండుకోవాలన్న ఉద్దేశ్యం మాత్రమే కనబడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు చేశారు.ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకొని సెలవులు ప్రకటించాలని,విద్యార్థులకు అండగా ఏబీవీపీ నిలబడుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *