నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

కూకట్ పల్లి జనవరి 18, శాంతి సహాయ సేవా సమితి, స్త్రీ హస్తిన మహిళా మండలి నూతన సంవత్సర కాలమానినీ ప్రముఖ యోగా గురువు, యోగ విజ్ఞాన కేంద్రం వ్యవస్థాపకులు జగన్ గురూజీ ఆవిష్కరించారు. ఆదివారం సాయి శాంతి సహాయ సేవా సమితి, స్త్రీ హస్తిన మహిళా మండలి ఫౌండర్ ఛైర్ పర్సన్ డాక్టర్ ఎర్రం పూర్ణ శాంతి గుప్తా జగన్ గురూజీని కలిసి ఆయన చేతుల మీదుగా కాలమానినీ అవిష్కరింప జేశారు. ఈసందర్భంగా జగన్ గురూజీ మాట్లాడుతూ.. సాయి శాంతి సహాయ సేవా సమితి సేవా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని, ఆపన్నులను ఆదుకునేల ఇలాగే సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. డాక్టర్ ఎర్రం పూర్ణశాంతి గుప్తా చేస్తున్న గోసేవా గూర్చి తాను వినాన్నని, మూగ జీవాలకు, ముఖ్యంగా గోవులకు సేవ చేయడం అంటే ఆ మాధావుడికి సేవ చేయడమేనని జగన్ గురూజీ అన్నారు. ఈకార్యక్రమంలో సాయి శాంతి సహాయ సేవా సమితి, స్త్రీ హస్తిన మహిళా మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.