janaprabha

janam kosam manam

బలమే జీవనం.. బలహీనతే మరణం”- వివేకానంద

కుకట్ పల్లి జనవరి 12(వార్తాప్రభ):
అల్విన్ కాలనీ 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించి స్మరించుకున్నారు. కార్పొరేటర్ మాట్లాడుతూ వివేకానందుడి ఆలోచనలు, ఆశయాలు మన జీవన విధానంలో భాగం అవ్వాలని అన్నారు. స్వామి వివేకానంద చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జన్మదినం జనవరి 12వ తేదీని 1984వ సంవత్సరం నుంచి భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తోందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబెర్స్ చిన్నోల్ల శ్రీనివాస్ మరియు కాశినాథ్ యాదవ్, బీసీ సెల్ అధ్యక్షులు రాజేష్ చంద్ర, ఏరియా కమిటీ మెంబెర్ రాములు గౌడ్, వాసుదేవ్ రావు, యాదగిరి, మహేష్, రవీందర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆల్విన్ కాలనీ 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా నూతన సంవత్సర కాలెండర్ ఆవిష్కరణ చేయబడింది. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షులు రాజేష్ చంద్ర, వార్డ్ మెంబెర్ కాశినాథ్ యాదవ్, ఏరియా కమిటీ మెంబెర్ రాములు గౌడ్, శివరాజ్ గౌడ్, వాసుదేవ్ రావు, షకీల్ మున్నా, వెంకట్ నాయక్, రాము, ఫారూఖ్ నస్రీన్ అపా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *