కూకట్ పల్లి లో నూతనంగా కోర్టు నిర్మించబోయే స్థలాన్ని పరిశీలించిన న్యాయమూర్తి రాజశేఖర్ రెడ్డి

కూకట్ పల్లి లో నూతనంగా కోర్టు నిర్మించబోయే స్థలాన్ని పరిశీలించిన న్యాయమూర్తి రాజశేఖర్ రెడ్డికూకట్ పల్లి ఫిబ్రవరి 6 ,(జనప్రభ):
ఖైతలాపూర్ ఆంజనేయ నగర్ లో నూతనంగా కోర్టు కోసం మూడు సంవత్సరాలు క్రితమే భూమిని సేకరించడం జరిగింది.అప్పటి న్యాయమూర్తి భూమికి శంకుస్థాపన చేసాడు. గత సంవత్సరం నుండి పనులు ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది.ఇప్పుడు నిర్మాణం కోసం నిధులు మంజూరు కావడంతో శనివారం తెలంగాణ ఉన్నత నాయస్థాన పోర్టుఫోలియో న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, జిల్లా న్యాయస్థాన న్యాయమూర్తి రాధ రాణి, అడిషనల్ జిల్లా న్యాయమూర్తి రాజేష్ బాబు స్థలాన్ని పరిశీలించారు.