ఫతే నగర్ డివిజన్ ను మరింత అభవృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ఫతే నగర్ డివిజన్ ను మరింత అభవృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్ పల్లి ఫిబ్రవరి 5,
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫతే నగర్ డివిజన్ కు సంబంధించి ముఖ్య నాయకులతో అభివృద్ధి కార్యక్రమాలు పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాయకులకు సూచించారు. పెండింగ్ పనులు ఉంటే సత్వరమే పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫతే నగర్ డివిజన్ లో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుందని, రోడ్లు, డ్రైనేజీ, శ్మశాన వాటిక లు… నర్సాపురం చౌరస్తా వద్ద అండర్ పాస్ బ్రిడ్జినిర్మాణం జరుగుతుందని వెల్లడించారు.ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఇంతవరకు ఏ పార్టీ, ఏ నాయకుడు చేయనటువంటి అభివృద్ధి సీఎం కేసీఆర్, నాయకత్వంలో కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళుతుందని ఈ కోవలోనే కూకట్ పల్లి నియోజకవర్గంలో ఐదు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సోషల్ మీడియా కూడా ఒక ముఖ్య పాత్ర వహిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీష్ అరోరా, కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, బిక్షపతి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.