janaprabha

janam kosam manam

అభివృద్ధి మన లక్ష్యం: కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…..

అభివృద్ధి మన లక్ష్యం: కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…..
కుకట్ పల్లి ఫిబ్రవరి3,(జనప్రభ):


బుధవారం కూకట్ పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాలానగర్ డివిజన్ కు సంబంధించి ముఖ్య నాయకులతో అభివృద్ధి కార్యక్రమాలు పై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ముందుకు వెళ్లాలని పెండింగ్ పనులు ఉంటే సత్వరమే పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అలాగే బాల నగర్ డివిజన్లో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణం అందుకు నిదర్శనమని అతిత్వరలోనే దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. దిల్కుష్ నగర్ కు సంబంధించి రోడ్డు సమస్య అతి త్వరలోనే కచ్చితంగా పూర్తి చేసి తీరుతామని ఈ సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఇంతవరకు ఏ పార్టీ ఏ నాయకుడు చేయనటువంటి అభివృద్ధి సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళుతుందని ఈ కోవలోనే కూకట్పల్లి నియోజకవర్గంలో 5 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని.. దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సోషల్ మీడియా కూడా ఒక ముఖ్య పాత్ర వహిస్తుందని అన్నారు. కావున జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు తెలియపరిచే టట్లు విస్తృతంగా సోషల్ మీడియాను కూడా ఉపయోగించి వలసిందిగా నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీష్ అరోరా..బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *