janaprabha

janam kosam manam

ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి ఫిబ్రవరి 2,(జనప్రభ)
కూకట్ పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బోయిన్ పల్లి డివిజన్ కు సంబంధించి ముఖ్య నాయకులతో అభివృద్ధి కార్యక్రమాలు పై సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే ఈ విధంగా ముందుకు వెళ్లాలని ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని పెండింగ్ పనులు ఉంటే సత్వరమే పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఇంతవరకు ఏ పార్టీ ఏ నాయకుడు చేయనటువంటి అభివృద్ధి సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళుతుందని ఈ కోవలోనే కూకట్ పల్లి నియోజకవర్గంలో 5 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సోషల్ మీడియా కూడా ఒక ముఖ్య పాత్ర వహిస్తుందని అన్నారు. కావున జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు తెలియపరిచే టట్లు విస్తృతంగా సోషల్ మీడియాను కూడా ఉపయోగించి వలసిందిగా నాయకులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *