సెమిస్టర్ పరీక్షా ఫలితాల గురించి జేఎన్టీయూహెచ్ రిజిస్టర్ మంజూరు హుస్సేన్ కివినతి పత్రం ఇచ్చిన జె ఎన్ టి యు హెచ్, జె ఎస్ సి రాష్ట్ర కమిటీ

సెమిస్టర్ పరీక్షా ఫలితాల గురించి జేఎన్టీయూహెచ్ రిజిస్టర్ మంజూరు హుస్సేన్ కివినతి పత్రం ఇచ్చిన జె ఎన్ టి యు హెచ్, జె ఎస్ సి రాష్ట్ర కమిటీ
కూకట్ పల్లి జనవరి 29,
జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీలో సెమిస్టర్ ఫలితాల గురించి రిజిస్టర్ ప్రొఫెసర్ మంజూరు హుస్సేన్ గారిని జె ఎన్ టి యు జె ఎ సి మరియు తెలంగాణ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కలవడం జరిగింది.మొన్న వెలువడినటు వంటి ప్రథమ, ద్వితీయ,తృతీయ సంవత్సర ఫలితాలలో దాదాపుగా రెండువేల మంది విద్యార్థులకు సున్న మార్కులు మరియు మాల్ ప్రాక్టీస్ కి పాల్పడని విద్యార్థులకు కూడా మాల్ ప్రాక్టీస్, ఇన్వాలిడ్ అని రావడం జరిగింది. కావున నా రిజిస్టర్ కి మరొకసారి రీవాల్యుయేషన్ చేసి మరొకసారి ఫలితాలు ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది, దానికి రిజిస్టర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగినది ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఎర్రబెల్లి జగన్,భాను ప్రకాష్ నాయక్, తరుణ్ యూనివర్సిటీ అనుబంధ కళాశాల విద్యార్థులు సూర్య కొప్పిశెట్టి ,వంశీ కృష్ణ, రేవంత్ రాజ్, బాలాజీ, రవి, అశోక్ రెడ్డి, రాకేష్ రెడ్డి,లోకేష్ తదితరులు పాల్గొన్నారు.