హాస్టల్ మెంటనన్స్ చార్జీలు యూనివర్సిటీ ఎ భరించాలి:జె ఎన్ టి యు హెచ్, జె ఎస్ సి రాష్ట్ర కమిటీ

హాస్టల్ మెంటనన్స్ చార్జీలు యూనివర్సిటీ ఎ భరించాలి:జె ఎన్ టి యు హెచ్, జె ఎస్ సి రాష్ట్ర కమిటీ
కుకట్ పల్లి జనవరి 27, (జనప్రభ):
జె ఎన్ టి యు హెచ్ యూనివర్సిటీ హైదరాబాద్ లో జె ఎన్ టి యు హెచ్,జె ఎస్ సి విద్యార్థి నేత భానుప్రకాశ్ నాయక్ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థుల కోవిడ్ సమయంలో మెంటనన్స్ చార్జీల ను యూనివర్సిటీ భరించాలని జె ఎన్ టి యు హెచ్, జె ఎస్ సి రాష్ట్ర నాయకులు జె ఎన్ టి యు హెచ్ యూనివర్సిటీ రెక్టర్ ప్రో.గోవర్ధన్, యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రో.మంజూర్ హుస్సేన్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు తగిన న్యాయం చేస్తామని యూనివర్సిటీ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో జె ఎన్ టి యు హెచ్, జె ఎస్ సి రాష్ట్ర నాయకులు లకావత్ భానుప్రకాశ్ నాయక్, బర్ల తరుణ్, సందీప్, వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.