కూకట్ పల్లి లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

కూకట్ పల్లి లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
కూకట్ పల్లి జనవరి 26,
72 వ గణంత్ర దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వివిధ ప్రాంతాల్లో జెండా ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా కూకట్ పల్లి డివిజన్ లో శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్ లో జెండా ఎగురవేసి అనంతరం కెపిహెచ్బి ఆటో స్టాండ్ వద్ద.. మరియు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్ఫూర్తితో ఈనాడు మనందరం కూడా ఇప్పటికీ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నం అంటే ఆయన ముందు చూపే కారణమని ఆ మహనీయుడికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.