janaprabha

janam kosam manam

పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి జనవరి 25,
ఫతేనగర్ డివిజన్ లో 5 కోట్ల 15 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం, ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు హామీలు నెరవేర్చడానికి కూకట్ పల్లి నియోజకవర్గంలో అన్ని డివిజన్ లలో ఎక్కడికక్కడ పనులు పూర్తిచేయడానికి శంకుస్థాపన నిర్వహిస్తున్నామని అలాగే ఇంతవరకు కూకట్ పల్లి నియోజకవర్గం లో ఏ పార్టీ కూడా చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు టిఆర్ఎస్ పార్టీలో జరిగాయని దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైనేజీలు అండర్ పాస్ బ్రిడ్జి లు.నిర్మాణాలు జరిగాయని తెలుపుతూ, టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ సంతృప్తిగా ఉన్నారని ఒక హైదరాబాద్ మహానగరం లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా మౌలిక సదుపాయాలతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ పటంలో ఒక గొప్ప నగరంగా చూపుతూ అనేక పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ వైపు వచ్చేలా చేస్తున్న మంత్రి కేటీఆర్ నిజంగా గొప్ప నాయకుడు అని కొనియాడారు.
1 . సి.సి. రోడ్లు పునరుద్ధరణ & లేయింగ్ పనులు – మాధవి నగర్, చర్చ్ లైను,
గౌతమ్ నగర్ 125.50 లక్షల తో
2 . సి.సి.రోడ్లు పునరుద్ధరణ పనులు – పాండు కాలనీ, ఆల్విన్ సొసైటీ 37 లక్షల తో
3 . సి.సి.రోడ్లు పునరుద్ధరణ పనులు – శివ శంకర్ నగర్, 55 లక్షలు
4 . సి.సి.రోడ్లు పునరుద్ధరణ పనులు – ఎల్.బి.నగర్, ఇందిరాగాంధి పురం 52 లక్షల తో
5 . సి.సి.రోడ్లు పునరుద్ధరణ పనులు – పిట్టల బస్తి , వాల్మీకి నగర్, తెనుగు బస్తి 78 లక్షలు
6 . సి.సి.రోడ్లు పునరుద్ధరణ పనులు – జింకలవాడ, ప్రభాకర్ రెడ్డి నగర్,హెచ్. పి.రోడ్
46 లక్షలు
7 . చైన్ లింక్ మెస్ – భరత్ నగర్ టు భరత్ నగర్ మార్కెట్, జింకలవాడ టు సమతా నగర్ , కళ్ళు కాంపౌండ్ టు దీన్ దయాల్ నగర్ బ్రిడ్జి, ఫిష్ మార్కెట్ కల్వర్టు టు మెయిన్ రోడ్
లలో 59 లక్షల తో
8 . సి.సి.రోడ్లు పునరుద్ధరణ మరియు లేయింగ్ – గవర్నమెంట్ స్కూల్ ఎల్.ఐ.జి & యం
ఐ.జి. లైన్లు భరత్ నగర్ 62.50 లక్షల తో శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *