janaprabha

janam kosam manam

సీసీ కెమెరాల అవగాహన సదస్సు కార్యక్రమంలో కార్పొరేటర్ సబిహా గౌసుద్దిన్

కూకట్ పల్లి జనవరి 24,

అల్లాపూర్ 116 డివిజన్ పరిధిలోని కొత్తూరి సీతయ్య నగర్ లో అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దిన్ మరియు సనత్ నగర్ సిఐ చంద్రశేఖర రెడ్డి మరియు పైడినాయుడు సీసీ కెమెరాల అవగాహనా సదస్సు ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శాంతి భద్రతలు కాపాడటానికి పోలీస్ అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారని సీసీ కెమెరాల ఏర్పాటు పై కాలనీ వాసులకు విస్తృత ప్రచారం తో అవగాహన కలిపిస్తున్నారని,ఒక సీసీ కెమెరా 100 మంది పోలిసుల తో సమానమని,కావున కాలనీ వాసులు ముందుకు వచ్చి తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కార్పొరేటర్ గారు పేర్కొన్నారు, ముఖ్యంగా మహిళల మరియు ప్రజల, రక్షణకు,దొంగతనాలు అరికట్టడానికి సి.సి.కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతుందిఅని ,24గంటల పాటునిరంతరం పనిచేసే నిఘా నేత్రలను ప్రతి కాలనీ, బస్తీలో ఏర్పాటు చేసుకోవాలి అని.కాలనీలలో నేరస్తులను గుర్తించడంలో మరియు కీలక సమయంలో సాక్ష్యంగా ఎంతగానో ఉపయోగపడుతుంది అని, డివిజన్ లోని కాలనీ మరియు బస్తీలు అభివృద్ధికి తన వంతు సహాయం ఉంటుందని తెలిపారు ,కాలనీ లో మౌలిక వసతుల కల్పన కు కృషి చేస్తానని,రోడ్లు ,డ్రైనేజి వంటి సమస్యలని పరిష్కరిస్తానని కార్పొరేటర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తూరి సీతయ్య నగర్ అధ్యక్షులు ఆర్ శివ, సెల్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ మరియు అబ్దుల్ రజాక్ మొయిజ్ బాలరాజు నరేందర్ అలీ యోగి రాజు గీత ఇందిరా రుబీనా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *