వడ్ల వేణుకు స్వామి వివేకానంద బెస్ట్ సర్వీస్ అవార్డు

జడ్చర్ల జనవరి 12: మన సేవా సమితి అధ్యక్షులు వడ్ల వేణుకు స్వామి వివేకానంద బెస్ట్ సర్వీస్ పురస్కారం 2020 అవార్డు ఆన్ లైన్ ద్వారా అందజేసి నట్లు వడ్ల వేణు మంగళవారం విలేకరులకు తెలిపారు. విశ్వభరి చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వడ్ల వేణు సేవలను గుర్తించి ఆన్ లైన్ లో పురస్కారాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వడ్ల వేణు మాట్లాడుతూ మన సేవా సమితి ఆధ్వర్యంలో కరోనా సమయంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలకు గాను అదే విధంగా సామాజిక సేవా కార్యక్రమాలతోనే అందజేసిన సేవలను గుర్తించి స్వామి వివేకానంద బెస్ట్ సర్వీస్ అవార్డు పురస్కారాన్ని అందజేయడం ఆనందదాయకమని అన్నారు. ప్రశంసా పత్రాన్ని అందజేసిన విశ్వభర ట్రస్ట్ బృందానికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తెలిపారు.