janaprabha

janam kosam manam

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్ సి లను ఏ.బి.సి.డి లుగా వర్గికరణ చెయ్యాలి:మాదిగ జర్నలిస్టు ఫోరం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎర్ర యాకన్న

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్ సి లను ఏ.బి.సి.డి లుగా వర్గికరణ చెయ్యాలి:మాదిగ జర్నలిస్టు ఫోరం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎర్ర యాకన్న

మేడ్చల్ జిల్లా ప్రతినిధి జనవరి 24,
జగద్గిరిగుట్ట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్ సి లను ఏ.బి.సి.డి లుగా వర్గికరణ చేయాలని మాదిగ జర్నలిస్టు ఫోరం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎర్ర యాకన్న డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదిగ జర్నలిస్టు ఫోరం 5వ జాతీయ మహాసభలకు మేడ్చల్ జిల్లా నుండి జర్నలిస్టులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని ఏండ్లు గా మాదిగలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయ చేస్తున్నాయి అన్నారు. ఎస్సీ లను ఏ.బి.సి.డి లుగా వర్గీకరించాలి అని కొన్ని ఏండ్ల నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు లో కేసు వేసి కొట్లాడుతు పోరాటం చేస్తున్న ఘనత ఎమ్మార్పీఎస్ కె దక్కింది అన్నారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కు లోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ లను ఏ.బి.సి.డి లుగా వర్గీకరించాలి అని అన్నారు. మాదిగ జర్నలిస్టు ఫోరం నాయకుల కు ఎమ్మార్పీఎస్ అన్ని రకాలుగా అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డప్పు రామస్వామి, జోగు వెంకట్, బాలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *