janaprabha

janam kosam manam

టిఆర్ఎస్ కార్పొరేటర్ నుంచి నాకు ప్రాణహాని ఉంది: బాధితురాలు వసుంధర

1 min read

టిఆర్ఎస్ కార్పొరేటర్ నుంచి నాకు ప్రాణహాని ఉంది: బాధితురాలు వసుంధర

జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించిన బిజెపి నాయకులు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి జనవరి 25, ఫిర్యాదును పట్టించుకోని పోలీసు అధికారులు జగద్గిరిగుట్ట కార్పొరేటర్ జగన్ తమపై దాడి చేశారని బీజేపీ మహిళా నేత వసుంధర ఆరోపించారు. తమ బంధువులపై కార్పొరేటర్ దాడి చేస్తుండగా అడ్డుకోబోతే తనని తన చెల్లెలిని కొట్టారని ఆమె తెలిపారు, గతంలో కూడా కార్పొరేటర్ జగన్ తమపై దాడి చేశారని బీజేపీ కార్యకర్తలు చెబుతున్నారు. దాడి విషయమై పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా తమ ఫిర్యాదు ని తీసుకోలేదని వాపోయారు. కార్పొరేటర్ నుంచి తమకు ప్రాణహాని ఉందంని, రోజు రోజుకి టిఆర్ఎస్ కార్పోరేటర్ మరియు తన అనుచరుల రౌడీయిజం మితిమీరి పోతున్నాయని, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని, టిఆర్ఎస్ నాయకులకు తొత్తుగా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ మారిందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరియు విషయం తెలిసి బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు భారీ ఎత్తున జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకొని కార్పోరేటర్ కొలుకుల జగన్ మరియు తన అనుచరులపై తక్షణమే కేసు నమోదు చెేసి అరెస్ట్ చేయ్యాలని, లేదా ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తున్న బిజెపి నాయకులు మరియు కార్యకర్తలని ఏసీపీ మరియు సిఐల ఆధ్వర్యంలో విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేస్తూ ఈడ్చుకుంటూ తమ పోలీసు వాహనాల్లో అరెస్టు చేసి వేరే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో సగటు పౌరునికి అన్యాయం జరిగితే కనీసం విచారణ జరిపి దోషులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ దోషులైన టిఆర్ఎస్ పార్టీ నాయకుల కొమ్ము కాయడం విడ్డూరంగా ఉందని, ఇకనైనా పోలీసులు మొద్దునిద్ర వదిలి వీధి రౌడీలా రెచ్చిపోతున్నా టీఆర్ఎస్ కార్పొరేటర్ కొలుకుల జగన్ ని వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *