janaprabha

janam kosam manam

సమాజ సేవలో మన సేవా సమితి…

జడ్చర్ల,
జడ్చర్ల పట్టణంలో మన సేవా సమితిని 2012 ఆగస్టు 9న 9మంది యువకులతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం 59 మంది సభ్యులు ఉన్నారు. మన సేవా సమితి యువకులు చిరు వ్యాపారం చేస్తుంటారు. అభాగ్యుల అభ్యున్నతి కోసం చిరు వ్యాపారం చేసుకుంటూ కొంతనైనా … సహయం చేయాలని, చిరు వ్యాపారులు కుటుంబ సభ్యుల అవసరాలకు పెద్దగా సరిపోకపోయినా … అందులోనే కొంత సహయం చేస్తుంటారు. ఇబ్బందుల్లో ఉన్న వారిని వారికి తోచినట్లు ఆదుకొంటుంటారు. పేద ప్రజలకు,ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, విద్యార్థులకు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుండాలనే ఉద్దేశ్యంతో సంఘం ప్రారంభీంచడం జరిగింది. అప్పటి నుంచి సమాజంలో ఉచిత వైద్య శిబిరాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మహనీయుల జయంతి, వర్దంతి సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో, అనాదఆశ్రమంలో పండ్లు, బ్రేడ్లు, పాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉత్తమ మార్కులు సాదించిన పదో తరగతి విద్యార్థులకు ప్రోత్సాహం, పాఠ్యపుస్తకాలు అందజేశారు. మహిళలు ఉపాధి పొందడం కోసం వారికి కుట్టు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. స్వచ్చ భారత్ కార్యక్రమాలు చేపట్టారు. యువతకు నైపుణ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పరీక్షలపై సైకాలజీస్ట్ లతో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. రహదారుల ఇరువైపుల, కాలి స్థలాల్లో మొక్కలు నాటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. యువతను ప్రోత్సహించడం కోసం క్రీడా పోటీలు నిర్వహించారు. అనాధ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. మున్సిపల్ కార్మికుల మహిళలను ప్రోత్సాహించేందుకు వారిని సన్మానించడం జరిగింది. అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2012 నుంచి ఇప్పటి వరకు 215 ప్రోగ్రాంలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ నుంచి వివిధ సంస్థల నుంచి35 అవార్డ్స అంధుకున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *