janaprabha

janam kosam manam

తెలంగాణలో బహుజన రాజ్యాధికార సాధన లక్ష్యంగా ఉద్యమిద్దాం

తెలంగాణలో బహుజన రాజ్యాధికార సాధన లక్ష్యంగా ఉద్యమిద్దాం
– బహుజన రాజ్యాధికార సదస్సులో వక్తలు

హైదరాబాద్ జనవరి 30,(జనప్రభ):
బహుజనుల త్యాగాల పునాదుల పై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికార సాధన లక్ష్యంగా ఐక్య ఉద్యమాలు నిర్మించాలని బహుజన ఉద్యమ నేత విజిఆర్ నారగోని పిలుపునిచ్చారు. ఆర్.పి.ఐ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ లోని ప్రెస్ భవన్ లో జరిగిన రాజ్యాధికార సదస్సు కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ బహుజన జాతులు వర్తమాన రాజకీయాలను విస్మరిస్తే శాశ్వత బానిసత్వమే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ లో రాజకీయ ఆనిశ్చితి ఏర్పడి, బహుజనుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాజ్యాధికారానికి రాని జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని ప్రజలు గుర్తించాలన్నారు. వినపడే ప్రతీ నినాదం ప్రజల కోసం కాదని, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ప్రజలు విశ్లేషించాలన్నారు. అంబేద్కరిజం అంటే కేవలం ఉద్యోగ ఉపాధి అవకాశాలు మాత్రమే కాదని, ప్రత్యక్ష ఓటు రాజకీయాలు అని ప్రజలు తెలుసుకోవాలన్నారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మరిపించేలా బహుజన రాజ్యాధికార సాదన ఉద్యమాన్ని నడిపించాలన్నారు. “ఓట్లు మావి, సీట్లు మీవా? ఇకపై చెల్లదు, ఇకపై సాగదు” అనే కాన్షీరామ్ ఇచ్చిన నినాదంతో ప్రజలను ఓటు చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. సిద్ధాంత పూరిత సంస్థలన్నీ జనతా ఫ్రంటు గా ఏర్పడి ఐక్య కూటమి గా రాబోయే ఎన్నికలలో పోటీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బి.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కనపల్లి గణేష్, ఆర్.పి.ఐ రాష్ట్ర చైర్మన్ రాందాస్, రాష్ట్ర అద్యక్షుడు మహేష్ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి జన్ను సాంబయ్య, కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మిట్టపల్లి రాజేశం, మహిళా నాయకురాలు అన్నవరం లక్ష్మి, బొమ్మకంటి రమేష్ వర్మ, జమ్మల నాగరాజు, దొంత భద్రయ్య, జనగామ భాగ్యలక్ష్మి, గడ్డం సదానందం, శారద, జింక భాగ్యలక్ష్మి, బోయిన కృష్ణ బాబు, ఎలగందుల అనిల్, ఉప్పులేటి రాజు, గసికంటి దివ్య, కన్నం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *