janaprabha

janam kosam manam

సామాన్యుడు రాజ్యంలో భాగమైనప్పుడే నిజమైన గణతంత్రం

సామాన్యుడు రాజ్యంలో భాగమైనప్పుడే నిజమైన గణతంత్రం
జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు
హైదరాబాద్ జనవరి 26,(జనప్రభ):
భారత దేశం గణతంత్ర దేశంగా మారి డెభ్బై ఏళ్లు దాటినా ఇంకా సామాన్యునికి స్వరాజ్ రాలేదని జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు అన్నారు. గణతంత్ర ఫలాలు దేశంలోని అందరికీ అందిన నాడే నిజమైన అభివృద్ధి చెందినట్లని హైదరాబాదులోని బేగంపేటలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, స్వరాష్ట్రం కొందరికి స్వాహా రాష్ట్రంగా మారిందన్నారు. సామాన్యులు రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి స్వరాజ్యం లక్ష్యంగా పని చేస్తుందని కాసాని పేర్కొన్నారు. గుండగాని మధుసూదన్ గౌడ, గుమిడెల్లి శ్రీనివాస్, శ్రీరాం శ్రీనివాస్ గౌడ్, ఎల్ ఎం ఎస్ గౌడ్, నగేష్ రాథోడ్, కన్నం సురేష్, వి. ఎల్ నర్సింహా రావు, అమూల్యరెడ్డి, శ్రీనాథ్, నరేష్ చారి, నవీన్, భరత్, శివ, శ్రీనివాస్ గౌడ్, రవీందర్, జానకి రాం, ఈదర శ్రీనివాసరావు, పివి రావు, అరవింద్ రెడ్డి, సాయి ,తదితర పార్టీ నాయకులు, అభిమానులు వేడుకల్లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *