janaprabha

janam kosam manam

అక్రమ భవన నిర్మాణాలపై లోకాయుక్తలో ఫిర్యాదు..

అక్రమ భవన నిర్మాణాలపై లోకాయుక్తలో ఫిర్యాదు..
హైదరాబాద్ ఫిబ్రవరి2,(జనప్రభ):


కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్భుల్లాపూర్ ప్రాంతాల్లో నిబందనలకు విరుద్దంగా నిర్మిస్తున్న అక్రమ భవన నిర్మాణాలపై తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సమన్వయ సమితి ఆద్వర్యంలో లోకాయుక్తలో ఫిర్యాదు చెయ్యడం జరిగింది. ఇటీవలి కాలంలో అక్రమ భవన నిర్మాణాలపై సేకరించిన ఆధారాలను ఆ ఫిర్యాదుతో పాటు అందించడం జరిగింది. అక్రమ భవన నిర్మాణాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ స్థాయిలో గండి పడుతున్నదని, టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి వల్లే అక్రమ కట్టడాలు పెరిగి పోతున్నాయని పొందుపర్చారు. జీహెచ్ ఎంసి పై స్థాయి అధికారులు సైతం పట్టించుకోకపోవడం వల్లే, టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించింది. దానితో పాటు వివిద దిన పత్రికల్లో వచ్చిన దాదాపు 50 అక్రమ భవన నిర్మాణాల ప్రత్యేక కథనాల కటింగ్స్ ను జత పరిచి లోకాయుక్తలో అందజెయ్యడం జరిగింది. వివిద దిన పత్రికల్లో కథనాలను సైతం పట్టించుకోకపోవడాన్ని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సమన్వయ సమితి తప్పుపట్టింది. కాగా లోకాయుక్తలో చేసిన ఫిర్యాదును సుమోటోగా స్వీకరించి, దానిపై విచారణ జరిపి ప్రభుత్వానికి రావాల్సిన ఆధాయాన్ని రాబట్టడమే కాకుండా, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సమితి కోరింది. వినియోగదారుల సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు సాంబరాజు చక్రపాణి, రాష్ట్ర సమన్వయకర్త గోపిరెడ్డి సంపత్ కుమార్ ఆద్వర్యంలో ఫిర్యాదును అందజెయ్యడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *