బోడుప్పల్ బ్రాహ్మణ సంఘ పాలక మండలి పూర్తిస్థాయి ఎన్నిక
1 min read
మేడిపల్లి జనవరి 24, ఆదివారం బోడుప్పల్ అఖిల బ్రాహ్మణ వికాస సమితి (రిజిస్టర్డ్) వార్షిక సమితి సమావేశంలో వై. శ్రీనివాస్ రావు ఆధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి పి.వి. యెస్. మూర్తి రెండు సంవత్సరాల నివేదికను చదివిన తరువాత, సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు జె. సాయి బాబా అధ్యక్షతన ఒక ఎలక్షన్ కమిటీ సభ్యులైన డి. పి. రావు, వై. సుధాకర్, విద్యా సాగర్ రావు, సూర్య ప్రకాష్ రావు ల ద్వారా సమితి పాలక మండలి పదాధికారుల ఎన్నికల సమావేశం వందల మంది శాశ్వత సభ్యుల మధ్య ప్రారంభించడం జరిగింది. ఈ సమితి సమావేశంలో అన్ని పదవులకు ఏకగ్రీవంగా పూర్తి స్థాయి పాలక మండలి పదాధికారులను ఎన్నుకోవడం జరిగింది, ప్రధాన కార్యదర్శి పి.వి.యెస్. మూర్తి, నంద్ కుమార్ జోషి ల మధ్య పోటీ జరుగగా నంద్ కుమార్ జోషి ప్రధాన కార్యదర్శి గా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నుకోవడం జరిగింది. అఖిల బ్రాహ్మణ వికాస సమితి (రిజిస్టర్డ్) పాలక మండలి పదాధికారులుగా రెండు సంవత్సరాల పరిమితితో అధ్యక్షులు గా – వై. శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షులు గా – చిట్యాల ప్రభు, వి. అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి గా – నంద్ కుమార్ జోషి, ప్రజా సంబంధాల కార్యదర్శి గా – కె. గురునాథ రావు, సంయుక్త కార్యదర్శులు గా – ధనంజయ కులకర్ణి, టి. సుందర్ రావు, డాక్టర్ సిహెచ్. కళ్యాణ్, జోనల్ కార్యదర్శులు గా – శిష్లా సాయి రామ్, ఏ. సుబ్బారావు, వి. శేష శేఖర్, శ్రీమతి వి. శ్రీలత, టి. యెస్. హనుమంత రావు, శ్రీమతి వై. రాణి పార్వతి, కార్యవర్గ కార్యదర్శి గా – మంద జగన్నాథం, సాంసృతిక కార్యదర్శులు గా – ఆదుర్తి శ్యామల రావు, శ్రీమతి ఎస్. జయ తులసి, కోశాధికారి – కుప్పా పురుషోత్తం, ఉప కోషాధికారి – ఎన్. వెంకటేశ్వర రావు, న్యాయ సలహా దారులు- వి. సునీల్ కుమార్, శ్రీమతి పి. వి. అరుణ కుమారి, కార్యవర్గ సభ్యులు గా – 12 మందిని ఎన్నుకోవడం జరిగిందని, సమితి వందల మంది శాశ్వత సభ్యుల మధ్య, ఎన్నికల అధికారి – జె. సాయి బాబా ప్రకటించడం జరిగిందని అధ్యక్షులు వై. శ్రీనివాస్ రావు తెలియచేసారు.